స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా...ఎవరు ఎలా బతకాలో...ఏం తినాలో..ఏం వినాలో...ప్రజల మీద రుద్దటం దారుణమని మంత్రి కేటీఆర్ అన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాట్లాడిన కేటీఆర్....ఎవరి దేవుడు గొప్ప అనే కొట్లాటలో అసలు లాజిక్ ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా పరిపాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారన్నారు.